devi music for balakrishna movie - Tollywood News- tollymasala.com updates
బాలకృష్ణ చిత్రం కోసం దేవి సంగీతంViews: 1538

devi-music-for-balakrishna-movie Rating: 2.3/5 (26 votes cast)

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం కథానాయికల ఎంపిక జరుగుతోంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చిరంజీవి సినిమాలకు పని చేసిన దేవిశ్రీ ప్రసాద్ బాలయ్య సినిమాకి ఇప్పటిదాకా పని చేయలేదు. ఈ సినిమాతో ఆయన బాలయ్యతో పని చేయబోతున్నారు.
రాజకీయంశాలతో పాటు, కుటుంబ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు.